ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. అన్ని పార్టీల అధినేతలు సీట్ల కేటాయింపుపై కసరత్తు మొదలుపెట్టారు. అయితే.. ఈ క్రమంలో టీడీపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ లు తగులుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొంది.. ఆ తర్వాత కొందరు టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే.

అయితే... ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇప్పుడు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. మొన్నటి వరకు టికెట్ వస్తుందని భావించన వారు.. ఇప్పుడు టికెట్ ఇవ్వడం లేదని తేలడంతో.. దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాకు టికెట్ ఇవ్వడం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

గత ఎన్నికల్లో బాషా చేతిలో ఓడిపోయిన కందికుంట ప్రసాద్‌కు ఈసారి సీటు ఖరారు చేశారు. చాంద్‌బాషాకు మంత్రి పదవి ఇస్తానని చివరి వరకూ ఊరించి ప్రభుత్వ విప్‌ పదవితో సరిపెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా పోయింది.