ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ఎన్నికల సంఘం  వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ బుధవారం నాడు లేఖ రాశారు.

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ బుధవారం నాడు లేఖ రాశారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈసీ వ్యవహరించిన తీరును చంద్రబాబునాయుడు తప్పు బట్టారు. ఈసీ తీరు దుర్మార్గంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పనిచేస్తోందని చంద్రబాబునాయుడు ఆ లేఖలో ఆరోపించారు. ఏపీ రాష్ట్రానికి పోలీసు పరిశీలకుడుగా వచ్చిన కె.కె.శర్మను వెంటనే బదిలీ చేయాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.

ఐటీ దాడులతో తమ పార్టీ అభ్యర్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదని ఆయన వివరించారు.మంగళవారం రాత్రి ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ను బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకొంది. ఈ పరిణామాలపై బాబు సీరియస్‌గా ఉన్నాడు.

సంబంధిత వార్తలు

ఈసీ తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి: నిరసనకు రెడీ