అమరావతి: మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్టు చంద్రబాబునాయుడు హామీ ఇవ్వడంతో ఆయన సంతృప్తి చెందినట్టు సమాచారం. పాణ్యం  నుండి గౌరు చరితకు టిక్కెట్టును కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో  పాణ్యం నుండి  టీడీపీ అభ్యర్ధిగా ఏరాసు ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. గౌరు చరిత రెడ్డి చేతిలో ఏరాసు ప్రతాప్ రెడ్డి ఓటమి పాలయ్యారు. వైసీపీలో ఇంత కాలం పాటు కొనసాగిన గౌరు దంపతులు వారం రోజుల క్రితమే బాబు సమక్షంలో చంద్రబాబు సమక్షంలో  టీడీపీలో చేరారు.

దరిమిలా పాణ్యం నుండి గౌరు చరితకే కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా బాబు ఏరాసుకు తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వని కారణంగా ఏరాసుకు  ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్టు బాబు చెప్పారు. బాబు ప్రతిపాదన పట్ల ఏరాసు ప్రతాప్ రెడ్డి సంతృప్తి చెందారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.