Asianet News TeluguAsianet News Telugu

బాలకృష్ణ మిత్రుడు కదిరికి చంద్రబాబుకు ఝలక్: దర్శి బరిలో శిద్దా సుధీర్

దీంతో శిద్దా సుధీర్ వైపే మెుగ్గు చూపినట్లు తెలుస్తోంది. సుధీర్ అభ్యర్థిత్వంపై కదిరి బాబూరావుకు తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం రాగద్వేషాలు, కుల, మతాలకు అతీతంగా పని చేయడం ముఖ్యమని చంద్రబాబు కదిరి బాబూరావుకు స్పష్టం చేశారట. 
 

chandrababu naidu change darsi candidate siddha sudheer instead of kadiri baburao
Author
Ongole, First Published Mar 21, 2019, 8:41 AM IST

 ఒంగోలు: ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పెద్ద సమస్యగా మారింది. దర్శి, కనిగిరి నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక చంద్రబాబుకు ఒక పెద్ద సవాల్ గా మారిందని చెప్పుకోవాలి. 

దర్శి నుంచి పోటీ చెయ్యాలని కదిరి బాబూరావుకు ఆదేశించిన చంద్రబాబు నాయుడు తాజాగా ఆయనకు ఝలక్ ఇచ్చారని తెలుస్తోంది. కదిరి బాబూరావుకు కాకుండా మంత్రి శిద్దా రాఘవరావు కుమారుడు శిద్ధా సుధీర్ కు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే కనిగిరి టికెట్ మాత్రం ఉగ్రనరసింహారెడ్డికే కేటయిస్తూ చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం అధికారికంగా టికెట్ శిద్ధా సుధీర్ ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

అందువల్లే కదిరి బాబూరావుకు బీఫామ్ ఇవ్వొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ కు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇకపోతే తొలుత దర్శి టికెట్ మంత్రి శిద్ధా రాఘవరావుకే కేటాయించారు చంద్రబాబు. 

అయితే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అనుకున్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్లమెంట్ అభ్యర్థిగా మంత్రి శిద్ధా రాఘవరావును బరిలోకి దించాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారు.

 చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు శిద్దా రాఘవరావు సన్నద్ధమయ్యారు. శిద్ధా రాఘవరావు ఒంగోలు పార్లమెంట్ కు వెళ్లడంతో దర్శి నుంచి కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావును ఎంపిక చేశారు. 

అయితే కదిరి బాబూరావు దర్శి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపారు. దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తనకు సమీప బంధువు అని అక్కడ నుంచి పోటీ చెయ్యనని చెప్పుకొచ్చారు. అటు కదిరి బాబూరావు ప్రాతినిథ్యం వహిస్తున్న కనిగిరి టికెట్ ను ఉగ్ర నరసింహారెడ్డికి కేటాయించారు. 

దర్శి నుంచి పోటీ చేసే అంశంపై మరోసారి ఆలోచించుకోవాలని కదిరిబాబూరావుకు తేల్చి చెప్పేశారు చంద్రబాబు. దీంతో తర్జనభర్జన పడ్డ కదిరి మంత్రి శిద్దా రాఘవరావు ఆహ్వానిస్తే అక్కడి నుంచి పోటీకి సిద్ధమని ప్రకటించారు. అయితే అప్పటికే దర్శి నుంచి పోటీ చేయనని కదిరి బాబూరావు చెప్పడంతో చంద్రబాబు సర్వే చేయించారు. 

ఈ సర్వేలో మంత్రి శిద్దా రాఘవరావు తనయుడు సుధీర్ కు అనుకూలంగా రిపోర్ట్ రావడంతో ఆయనను బరిలోకి దించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. అతేకాదు దర్శి నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులంతా కుల, మతాలకు అతీతంగా బాబూరావు వద్దని, శిద్దా కుటుంబ సభ్యులకే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ కూడా చేశారు. 

కొంతమంది అయితే పదవులకు రాజీనామాలు సైతం చేసేశారు. దీంతో శిద్దా సుధీర్ వైపే మెుగ్గు చూపినట్లు తెలుస్తోంది. సుధీర్ అభ్యర్థిత్వంపై కదిరి బాబూరావుకు తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం రాగద్వేషాలు, కుల, మతాలకు అతీతంగా పని చేయడం ముఖ్యమని చంద్రబాబు కదిరి బాబూరావుకు స్పష్టం చేశారట. 

దర్శి వైసీపీ అభ్యర్థి తన బంధువు కాబట్టి పోటీ చెయ్యనని చెప్పిన వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాగద్వేషాలు, బంధుత్వాలకు అతీతంగా పనిచెయ్యాల్సింది పోయి పోటీ చెయ్యనని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

ఈ సందర్భంలో పోటీ చేసి పార్టీని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఇకపోతే బుధవారం సాయంత్రం 7.30 గంటలకు సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని పార్టీ జిల్లా కార్యాలయాల్లో బీఫామ్ లు తీసుకున్న అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. 

ఈ సందర్భంలో దర్శి అసెంబ్లీ అభ్యర్థి బీఫామ్ ఇవ్వొద్దని అలాగే ఉంచాలని దామచర్లకు చంద్రబాబు ఆదేశించారు. దీంతో దర్శి నుంచి మంత్రి శిద్దా తనయుడు సుధీర్‌ను రంగంలోకి దించాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది. 

చంద్రబాబు నాయుడు ఊహించని రీతిలో షాక్ ఇవ్వడంతో చేసేది లేక కదిరి బాబూరావు అమరావతి నుంచి కనిగిరి పయనమయ్యారట. కనిగిరి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చెయ్యాలని భావిస్తున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios