ప్రధాని నరేంద్రమోదీ.. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మోదీ మహబూబ్ నగర్ లో తన ప్రసంగాన్ని కొనసనాగిస్తున్నారు. సాయంత్రం ఏపీలో కూడా తన పర్యటన చేయనున్నారు. ఈ క్రమంలో మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

మోదీద ఏపీ పర్యటనకు రావడాన్ని తప్పుపట్టారు. మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు... మోదీపై మండిపడ్డారు. విభజన గాయాలతో కుదేలైన ఏపీకి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి  మాట తప్పారని మండిపడ్డారు.

ఏపీకి మోదీ నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. మోదీ ఆర్థిక నేరస్తులతో కుమ్మక్కయ్యారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని, ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. మోదీ ఏపీ పర్యటనకు ఎందుకు వస్తున్నారంటే.. వైసీపీకి సాయం చేయడానికి వస్తున్నారని అన్నారు. ‘రాష్ట్ర ప్రజలారా మేల్కోండి... రాష్ట్ర ద్రోహులకు బుద్ధిచెప్పే సమయం వచ్చింద’ని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.