శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారు. ఎప్పుడూ సీరియస్ గా ఉండే ఆయన ఆదివారం మాత్రం తన ఆనందాన్ని పట్టలేక పాటకు స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

శనివారం ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన టీడీపీ ప్రచార సభ వేదిక మీదికి ఎక్కుతున్నారు. ఆ సమయంలో ఆయనపై రూపొందించిన "ఆపదలో గట్టెక్కించే నాయకుడు.. సీఎం చంద్రబాబు నాయుడే" అనే పాట ప్రారంభమైంది. 

బ్యాక్‌గ్రౌండ్‌లో హుషారైన పాటతో పాటు సభకు విశేషంగా ప్రజలు రావడంతో చంద్రబాబు పులకించిపోయారు. తనపై రాసిన పాటకు అనుగుణంగా చేతులు ఊపుతూ ఆయన స్టెప్పులు వేశారు. పాట కొనసాగుతున్నంతసేపు చేతులు ఊపుతూ జనాన్ని ఉత్సాహపరిచారు. 

వారు కూడా లేచి నిలబడి చేతులు ఊపడంతో చంద్రబాబు విజయ సంకేతం చూపిస్తూ - ఇచ్ఛాపురంలో ఇంతమంది జనాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

నాని vs విజయ్ దేవరకొండ: బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్