విశాఖపట్నం: తాను ఇకపై 24 గంటలు విశాఖపట్నం ప్రజలకు అందుబాటులో ఉంటానని విశాఖ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. విశాఖఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన తాను 24 గంటలు విశాఖలోనే ఉంటానని అనుమానం ఉంటే బాండ్ పేపర్ మీద రాసిస్తా అంటూ వ్యాఖ్యానించారు.  

మాఫియాలకు సపోర్ట్ చేసే నాయకులు కావాలా...లేక సమర్థవంతమైన నాయకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. తాను ఇక ఫుల్ టైం రాజకీయ నేతనని చెప్పుకొచ్చారు. భూకబ్జాల వల్లే విశాఖపట్నంకు వేరే విధంగా ఉందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ప్రజలు జనసేన పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు లక్ష్మీనారాయణ.