ఎన్నికలు సమీపిస్తున్న వేళ... చంద్రబాబుకి మరో ఊహించని షాక్ తెలిసింది. ఆయనపై బిహార్  కోర్టులో పిటిషన్ దాఖలైంది.  ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీకి మద్దతుగా వ్యూహాలు రచిస్తున్న బిహార్ కి చెందిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పై మండిపడ్డారు.

ప్రశాంత్ కిశోర్ ని ఉద్దేశిస్తూ.. బిహార్ బందిపోటు అని వ్యవహరించారు.  ఈ కామెంట్స్ కి ప్రశాంత్ కిశోర్ అప్పటికప్పుడే ట్విట్టర్ వేదికగా కౌంటర్ కూడా ఇచ్చారు. తాజాగా ఈ వ్యాఖ్యలకు సంబంధించి చంద్రబాబుపై బిహార్ లోని ముజఫర్ పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి తాజాగా దీనిపై విచారణ చేయనున్నట్లు ప్రకటించారు.

దీంతో చంద్రబాబు ఈ కేసును ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు చేసిన బిహార్ బందిపోటు అనే వ్యాఖ్యలు బిహారీలను అవమానించేలా ఉన్నాయని ఓ న్యాయమూర్తి కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా పిటిషన్ ను పరిగణలోకి తీసుకొని విచారిస్తామని  కోర్టు తెలిపింది. 

ఇటీవల ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిశోర్ ఓ బీహార్ డెకాయిట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్షంగా ఆయన పేరును ప్రస్తావించకపోయినా.. ఆయన ప్రశాంత్ కిశోర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘బీహార్ నుంచి వచ్చిన డెకాయిట్ ఏపీలో ఓట్లను తొలగిస్తున్నారు.’ అని చంద్రబాబు అన్నారు.