వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ  బుద్ధా వెంన్న మండిపడ్డారు. ఎన్నికల ప్రచారాలను ఇరుకు సందుల్లో సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఆయన సభలో చనిపోయిన వారి కుటుంబాలను కూడా పరిమర్శించలేదని విమర్శించారు. 

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. అయితే సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా అని జగన్‌కి సవాల్ విసిరారు. తప్పులన్నీ చేసి తప్పేంటి అని జగన్ అంటున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు.