శ్రీశైలం:  కర్నూల్ జిల్లా శ్రీశైలం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి రంగం సిద్దం చేసుకొన్నారనే ప్రచారం సాగుతోంది. చంద్రబాబునాయుడు సూచన మేరకు పోటీకి సిద్దమైనట్టుగా ప్రచారం సాగుతోంది.

శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలోని  ఆత్మకూరు మండలంలో  మంగళవారం సాయంత్రం బుడ్డా రాజశేఖర్ రెడ్డి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్నారు.

తన భార్యకు అనారోగ్యంగా ఉన్న కారణంగా రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్టుగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి  సోమవారం సాయంత్రం ప్రకటించారు. అయితే ఈ విషయమై బుడ్డా రాజశేఖర్ రెడ్డిని చంద్రబాబు పిలిపించి మాట్లాడినట్టు సమాచారం. 

దీంతో బుడ్డా రాజశేఖర్ రెడ్డి మనసు మార్చుకొన్నట్టుగా ప్రచారం సాగుతోంది. కర్నూల్ జిల్లాలో ఇవాళ జరిగిన టీడీపీ సమావేశంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డితో చంద్రబాబునాయుడు  ఈ విషయమై చర్చించినట్టు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాలకు బుడ్డా గుడ్‌బై: కొత్త అభ్యర్ధి కోసం చంద్రబాబు అన్వేషణ