ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ నేతలతో ప్రచారం చేయిస్తుండటంతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ఆ దిశగా పావులు కదుపుతున్నారు. 

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ నేతలతో ప్రచారం చేయిస్తుండటంతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ఆ దిశగా పావులు కదుపుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

తన పార్టీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతితో ప్రచారానికి ప్లాన్ చేశారు. జనసేన, బీఎస్పీ, వామపక్షాల అభ్యర్థుల తరపున మాయావతి రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. 

షెడ్యూల్ ఇదే:

* మంగళవారం రాత్రి లక్నో నుంచి మాయావతి విశాఖకు చేరుకుంటారు.

* బుధవారం విశాఖలో పాత్రికేయుల సమావేశం

* అదే రోజు విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో భారీ బహిరంగసభ

* గురువారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ

* గురువారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పవన్ కల్యాణ్‌తో కలిసి బహిరంగసభ