Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో మేం గెలుస్తాం, పవన్ సీఎం: విశాఖలో మాయావతి

ఉమ్మడి ఏపీ  రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని  అభివృద్ధి చేయలేదు. దీంతో విభజన డిమాండ్‌ మొదలైందని బీఎస్పీ  చీఫ్ మాయావతి అభిప్రాయపడ్డారు..అభివృద్ధి చేసి ఉంటే ఏపీ విభజన జరిగి ఉండేది కాదని  ఆమె చెప్పారు. 

bsp chief mayawathi says our cm candidate pawan kalyan in andhra pradesh
Author
Visakhapatnam, First Published Apr 3, 2019, 12:21 PM IST

విశాఖపట్టణం:  ఉమ్మడి ఏపీ  రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని  అభివృద్ధి చేయలేదు. దీంతో విభజన డిమాండ్‌ మొదలైందని బీఎస్పీ  చీఫ్ మాయావతి అభిప్రాయపడ్డారు..అభివృద్ధి చేసి ఉంటే ఏపీ విభజన జరిగి ఉండేది కాదని  ఆమె చెప్పారు. 

బుధవారం నాడు విశాఖపట్టణంలో బీఎస్సీ చీఫ్ మాయావతి జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.ఏపీలో లోక్‌సభ,అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయని మాయావతి చెప్పారు. మరో వైపు తెలంగాణలో లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నట్టు ఆమె గుర్తు చేశారు.ఏపీ ప్రజలు కొత్త తరం నాయకులను కోరుకొంటున్నారని ఆమె చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడ ప్రాంతీయ పార్టీల పాలనలో కూడ అదే పరిస్థితి నెలకొందన్నారు.

ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. ఏపీ రాష్ట్రంలో తమ కూటమి అధికారాన్ని కైవసం చేసుకొంటుందని ఆమె ధీమాను వ్యక్తం చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని ఆమె ప్రకటించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని  బీజేపీ అమలు చేయలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో  కాంగ్రెస్, బీజేపీలు ఏపీ ప్రజలను మోసం చేశాయని ఆమె విమర్శించారు. 

2014లో అప్పుడున్న పరిస్థితుల కారణంగా టీడీపీ, బీజేపీల కూటమికి తాను  మద్దతిచినట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.దళితులను ముఖ్యమంత్రిని చేస్తామని తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే తెలంగాణకు దళితుడిని ఏ కారణం చేత చేయలేకపోయారో కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

దేశానికి మాయావతి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  చాయ్‌వాలా ప్రధానమంత్రిగా అయ్యారు. సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పోరాటం చేసే మాయావతి ప్రధానమంత్రి అయితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios