ఏపీలో ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరిగిన సంగతి తెలిసిందే. కాగా...ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లన్నీ తమ పార్టీకే పడ్డాయని టీడీపీ నేత బొండా ఉమ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏపీలో ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరిగిన సంగతి తెలిసిందే. కాగా...ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లన్నీ తమ పార్టీకే పడ్డాయని టీడీపీ నేత బొండా ఉమ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ ఎన్నికల్లో కచ్చితంగా తమ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రన్న రుణం తీర్చుకోడానికి మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని అన్నారు. ఈవీఎంలు మొరాయించినా.. గంటల తరబడి క్యూలైన్లలో నిలుచుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాత్రి అయినా మహిళలు క్యూలైన్లలో ఉన్నారంటే.. తమకు మేలు చేసిన ప్రభుత్వాన్ని గెలుపించుకోడానికేనని అన్నారు.

గతంలో వైఎస్ పాలనను.. ప్రస్తుతం చంద్రన్న పాలనను ప్రజలు గనమించారని బొండా ఉమ అన్నారు. అందుకే మళ్లీ చంద్రన్న ను గెలిపిచేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారని స్పష్టం చేశారు.