ఏపీలో ఎన్నికల నగరా మోగింది. దీంతో.. ఇప్పటికే పలువురు టికెట్ దక్కిన అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుస్తున్నారు. కాగా.. మరికొందరు అభ్యర్థులు నామినేషన్లు వేసే ప్రక్రియను కూడా ప్రారంభించారు.  పెనమలూరు  టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ సోమవారం నామినేషన్ వేశారు.

పోరంకిలోని తన కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. ఈ ర్యాలీలో ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ, వంగవీటి రాధా, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా ఎత్తున పాల్గొన్నారు.