ఎన్నికల అఫిడవిట్ లో లోకేష్ పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసి.. పప్పులో కాలేశారు. అఫిడవిట్ లో భర్త పేరు అని ఉన్న స్థానంలో తన తండ్రి పేరు రాశారు. కాగా.. అది తీవ్ర వైరల్ అయ్యింది. అయితే.. విచిత్రం ఏమిటంటే... అదే తప్పు చంద్రబాబు కూడా చేయడం. చంద్రబాబు కూడా భర్త పేరు అని రాసి ఉన్న చోట ఆయన తండ్రి పేరు రాశారు.

కాగా.. దీనిపై బీజేపీ నేత కన్నాలక్ష్మీ నారాయణ ట్విట్టర్ వేదికగా చూపించి విమర్శలు గుప్పించారు. ‘‘బాబు లీకేష్,
"ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?" అనే సామేత నిజంచేశావ్.. నువ్వు అవినీతిలో డాడీకి కాపీ.! తెలివిలో డాడీకి కలర్ జిరాక్స్ అనుకున్నాం కానీ ఆఖరికి అఫిడవిట్ లోనూ కాపీనేనా!? ఇద్దరికి అఫిడవిట్ సరిగ్గా వేయడం రాదు కానీ అమరావతిని అమెరికా చేస్తా అని KA పాల్ కబుర్ల చెబుతారు’’ అంటూ కన్నా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. చంద్రబాబు, లోకేష్ అఫిడవిట్ లకు సంబంధించిన ఫోటోలను కూడా కన్నా తన ట్విట్టర్ లో పెట్టడం విశేషం.