కర్నూలు: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తమ కుటుంబాన్ని ఓడిచేందుకు ప్రత్యర్థులు అంతా ఏకమవుతున్నారని ఆరోపించారు. ఎవరు ఏకమైనా తమ కుటుంబాన్ని ఓడించలేరని తెలిపారు. 

తమను ఓడించాలంటే వాళ్ల ముత్తాతలు దిగిరావాలంటూ స్పష్టం చేశారు. ఆళ్ళగడ్డ అంటే భూమా గడ్డ అని ప్రత్యర్థులు తెలుసుకోవాలని హెచ్చరించారు. ఇకపోతే భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు ఆయన వెన్నంటే ఉన్న వారంతా భూమా అఖిలప్రియతో విబేధించారు. 

చివరకు మేనమామ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అలాగే ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు కూడా వైసీపీలో చేరిపోయారు. ఎస్వీ సుబ్బారెడ్డి పూర్తిగా భూమా అఖిలప్రియను వ్యతిరేకిస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో అఖిల ప్రియ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.