హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. ప్రతిపక్ష పార్టీ వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. అదేవిధంగా.. పవన్ జనసేన పార్టీపై కూడా బాలయ్య పరోక్షంగా స్పందించారు.

శుక్రవారం బాలకృష్ణ.. తన భార్య వసుంధరతో కలిసి అనంతపురం జిల్లా సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం బాలయ్య.. మీడియాతో మాట్లాడారు.

ఈసారి కూడా విజయం టీడీపీకే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి నుంచి వైసీపీకి హత్యా రాజకీయాలు అలవాటేనని మండిపడ్డారు. అనంతరం జనసేన పార్టీ గురించి పరోక్షంగా కామెంట్స్ చేశారు. జనసేన ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందని ఓ విలేకరి ప్రశ్నించగా.. కొత్త పార్టీలు పెద్దగా ఏమీ ప్రభావం చూపించవన్నారు.

సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధే మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకువస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీకి తప్ప రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటు వేసినా.. బీజేపీ కే ఓట్లు వేశారన్నారు. హిందూపురంలో జరిగిన అభివృద్ధి తనను మంచి మెజార్టీతో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.