ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది.  ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు.. తమ పార్టీ తొలి జాబితాను విడుదల చేశారు. కాగా..ఈ జాబితాలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మిత్రుడికి కూడా టికెట్ దక్కింది. బాలయ్య ఒత్తిడితో.. కదిరి బాబురావుకి..టికెట్ దక్కినట్లు తెలుస్తోంది.

ముందు కనిగిరి టికెట్  ఉగ్ర నరసింహారెడ్డికి  ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారట. ఉగ్ర నరసింహారెడ్డి కూడా.. తన గెలుపుపై ధీమా ఉన్నారు. టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని కూడా చెప్పారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య.. రంగంలోకి దిగి.. ప్లాన్ మార్చేసినట్లు తెలుస్తోంది. 

బుధవారం హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి అమరావతి వచ్చిన ఆయన కనిగిరి అసెంబ్లీ టికెట్టును తిరిగి కదిరికే ఇవ్వాలని ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. సర్వేల సమాచారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా మీరు టికెట్టు ఇవ్వండి. 

నేను కూడా వెళ్లి ప్రచారం చేసి కదిరిని గెలుపించుకొని వస్తానని ఆయన అన్నట్లు తెలిసింది. దీంతో ముఖ్యమంత్రి వ్యూహం మార్చి కనిగిరి నుంచి కదిరినే రంగంలోకి దింపి, ఉగ్రనరసింహారెడ్డిని దర్శి నుంచి బరిలోకి దించాలని భావించారు.