విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది ఎన్ఐఏ కోర్టు. 30 వేల నగదు, ఇద్దరి పూచీకత్తుపై ఎన్ఐే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న శ్రీనివాసరావు శుక్రవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నాడు. ఇకపోతే గత ఏడాది అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో వైయస్ జగన్ పై కోడికత్తితో దాడి చేశాడు శ్రీనివాసరావు. 

హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారిస్తున్నారు. జగన్ పైదాడికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తు సంస్థను నియమించింది. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఐఏతో విచారణ జరిపించాలని డిమాండ్ చేయడంతో ఎన్ఐఏ కేసు దర్యాప్తు చేస్తోంది.