కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం రక్తసిక్తమయ్యింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థిపై వేటకొడవళ్లతో దాడి చేశారు. మంత్రాలయం మండలంలో ప్రచారం చేపడుతుండగా.. టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై కొందరు వ్యక్తులు వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో.. తిక్కారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.

దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఏఎస్సై గోపాల్ కి కూడా తీవ్రగయాలయ్యాయి. ఈ దాడులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు కూడా జరిపారు. ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని తిక్కా రెడ్డి ఆరోపిస్తున్నారు.