పులివెందుల: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారా కాదా అనే విషయమై  వైఎస్ భారతి జ్యోతిష్యం చెప్పించారు. ఈ ఎన్నికల్లో ఏపీ రాష్ట్రానికి జగన్ కచ్చితంగా సీఎం అవుతారని జ్యోతిష్యుడు చెప్పడంతో భారతితో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతోషంతో ప్రచారాన్ని నిర్వహించారు.

కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా గురువారం నాడు భారతి ఇస్లాంపురలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో జ్యోతిష్యం చెప్పే కాటికాపరి వారికి ఎదురుపడ్డారు.

జగన్ రాజకీయ భవిష్యత్తు గురించి జ్యోతిష్యుడిని అడుగుదామని కొందరు నేతలు భారతి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో భారతి నవ్వుకొంటూ జ్యోతిష్యం  చెప్పే కాటికాపరి వద్దకు వెళ్లింది.  

జగన్ సీఎం అవుతారా అని వైసీపీ కార్యకర్తలు, నేతలు జ్యోతిష్యుడిని అడిగారు. ఈ ఎన్నికల్లో జగన్ కచ్చితంగా సీఎం అవుతారని జ్యోతిష్యుడు చెప్పాడు. దీంతో భారతితో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆనందంగా ప్రచారంలో మునిగిపోయారు.వైసీపీ ప్రకటించిన నవరత్నాలతో పాటు పలు అంశాలను వైఎస్ భారతి ప్రచారం చేస్తున్నారు.