ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ అఖండ విజయం సాధించి.. ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని ప్రముఖ సిద్ధాంతి విష్ణుభట్ల లక్ష్మీ నారాయణ అన్నారు

ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ అఖండ విజయం సాధించి.. ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని ప్రముఖ సిద్ధాంతి విష్ణుభట్ల లక్ష్మీ నారాయణ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం వైసీపీ కార్యాలయంలో సిద్ధాంతి విష్ణుభట్ల లక్ష్మీ నారాయణ పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ముందుగా పూజ చేసి ఆ తర్వాత పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగం ప్రకారం జగన్ కి గ్రహబలం బాగా ఉందని.. విశేష ప్రజాదారణ పొందుతారని చెప్పారు. 

ప్రతిపక్షం, అధికారం పార్టీల మధ్య పోరు ఉన్నప్పటికీ ప్రతిపక్షానికే అధికార యోగం సిద్ధిస్తుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయంలో ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పారు. గ్రహ గతుల ఆధారంగా తాను ఈ అంశాలు చెబుతున్నానన్నారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయని.. రైతులు మంచి లాభాలు సాధిస్తారని చెప్పారు. 

దేశంలో శాంతి భద్రతలు పదిలంగా ఉంటాయన్నారు. సిమెంట్‌, ఐరన్‌ ధరలు పెరుగుతాయని చెప్పారు.రియల్‌ ఎస్టేట్‌ చాలా బాగుంటాయని తెలిపారు.
గాయనీగాయలకు అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తారని చెప్పారు.