ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ఇటీవల ముగిసింది. ఫలితాలు మే23వ తేదీన విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రధాన పార్టీ నేతలతోపాటు..ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గెలుపు ఓటములపై ఓ రేంజ్ లో బెట్టింగ్ లు కాస్తున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో కచ్చితంగా చంద్రబాబు గెలుస్తారని వాస్తు నిపుణుడు కొమ్మినేని మల్లేశ్వరరావు చెప్పారు.

హైదరాబాద్ లోని  చంద్రబాబు నివాసాన్ని తాను చూసానని.. వాస్తు చాలా బాగుందని ఆయన అన్నారు. ఆ ఇంటి వాస్తు ప్రకారం మళ్లీ చంద్రబాబుకి సీఎం పదవి దక్కడం ఖాయమని చెప్పారు. లోకేష్ కూడా మంగళగిరిలో గెలుస్తారని.. ఆయన మళ్లీ మంత్రి అవుతారని ఆయన తెలిపారు.

తాను గత 20 సంవత్సరాలుగా వాస్తు శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశానని..తాను చెప్పింది కచ్చితంగా నిజమౌతుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్, పవన్ ఇంటి వాస్తులు కూడా బాగానే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం చంద్రబాబు హవా నడుస్తోందన్నారు. ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఎదురైనా చంద్రబాబు సీఎం పీఠంపై కూర్చోవడం ఖాయమని తేల్చి చెప్పారు.