తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి దేవినేని ఉమా. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరం విషయంలో కేసీఆర్ కేంద్రానికి లేఖపై స్పందించారు.

పార్లమెంట్ చేసిన చట్టంలో తెలంగాణ సమ్మతితో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటిస్తున్నామని, అన్ని రకాల అనుమతులకు కేంద్రప్రభుత్వం సహకరించాలని ఉన్నట్లు ఉమా పేర్కొన్నారు.

పోలవరం పునాదులు కూడా లేవలేదని సాక్షి పత్రికలో జగన్ రాయిస్తున్నారని.. కానీ 70 శాతం పనులు పూర్తయ్యాయన్న సంగతి ప్రతిపక్షనేతకు తెలియదా అని ఉమా ప్రశ్నించారు. ప్రధాని మోడీ, కేసీఆర్, జగన్‌లు కలిసి ఆంధ్రప్రదేశ్‌పై కుట్రలు చేస్తున్నారని ఉమా ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో అన్ని రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు, నిపుణులు ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.