Asianet News TeluguAsianet News Telugu

ఆయన దేవుడిచ్చిన మామ, నాకు మాటిచ్చారు: మంత్రి భూమా అఖిలప్రియ

ఏవీ సుబ్బారెడ్డి తమకు దేవుడిచ్చిన మామ అంటూ చెప్పుకొచ్చారు మంత్రి భూమా అఖిలప్రియ.తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తానని మాట ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిలప్రియకి మహిళలు నుదుట కుంకుమ దిద్ది స్వాగతం పలికారు. ఏవీ సబ్బారెడ్డి తమ వెంట లేకున్న టీడీపీ విజయానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. 
 

ap minister comments on av subbareddy
Author
Kurnool, First Published Mar 28, 2019, 11:22 AM IST


కర్నూలు: టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి భూమా అఖిలప్రియ. ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరంలో ఇంటింట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఏవీ సుబ్బారెడ్డి తమకు దేవుడిచ్చిన మామ అంటూ చెప్పుకొచ్చారు. 

తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తానని మాట ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిలప్రియకి మహిళలు నుదుట కుంకుమ దిద్ది స్వాగతం పలికారు. ఏవీ సబ్బారెడ్డి తమ వెంట లేకున్న టీడీపీ విజయానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. 

ఆళ్లగడ్డ అభివృద్ధి అమ్మా నాన్నల కల అని చెప్పుకొచ్చారు. మరోసారి చంద్రబాబును సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు టీడీపీ పక్షాన ఘన స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. 

రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని ప్రకటించారు. ఆళ్లగడ్డ అభివృద్ధి తన తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిల కల అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి రూ.2 వేలు కోట్లు మంజూరు చేశారని ఆ నిధులతో అన్ని విధాలా అభివృద్ధి చేశామని తెలిపారు. 

ఆళ్లగడ్డ అభివృద్ధికి చిరునామాగా మార్చానని మంత్రి అఖిలప్రియ చెప్పుకొచ్చారు. ఇకపోతే భూమా అఖిలప్రియ సొంత మేనమామలైన ఎస్వీ మోహన్ రెడ్డి, ఎస్వీ జగన్మోహన్ రెడ్డిలు తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 

ప్రస్తుం భూమా అఖిలప్రియ వెంట సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. మేనమామలు దూరం కావడంతో ఆమె కాస్త ఆందోళనకు గురైనప్పటికీ తర్వాత తేరుకున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 

ఇకపోతే ఏవీ సుబ్బారెడ్డి భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు. భూమా నాగిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించే వ్యక్తులలో మెుదటి వ్యక్తి ఏవీ సుబ్బారెడ్డి. అయితే భూమా నాగిరెడ్డి మరణానంతరం భూమా కుటుంబానికి ఏవీ సుబ్బారెడ్డి కుటుంబానికి వివాదాలు చెలరేగాయి. 

భూమా వర్గీయులు, ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. 

అటు 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ టికెట్ ఆశించారు ఏవీ సుబ్బారెడ్డి. తాను భూమా నాగిరెడ్డి కోసం పోటీ చెయ్యలేదని అతని కోసం తాను సీటు త్యాగం చేసేవాడినని చెప్పుకొచ్చారు. తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని ఇవ్వకపోతే చూస్తానంటూ కూడా హెచ్చరించారు. 

అయితే చంద్రబాబు నాయుడు బుజ్జగించడంతో శాంతించి రాజీకొచ్చారు. మంత్రి అఖిలప్రియ గెలుపుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఏవీ సుబ్బారెడ్డిని దేవుడు ఇచ్చిన మామ అంటూ మంత్రి అఖిలప్రియ ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios