ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఎన్నికల కమిషనర్లు అశోక్ లావాస, సుళీల్ చంద్రతో శుక్రవారం సమావేశమైన ఆయన తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చారు.

ఇంటెలిజెన్స్ డీజీగా బాధ్యతల నుంచి తప్పించినప్పటికీ ఏబీ వెంకటేశ్వరరావు అనధికారికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఠాకూర్‌ను ఈసీ వివరణ అడింది. అలాగే ఎన్నికల విధుల్లో పక్షపాతంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.

తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఠాకూర్‌ను ఏసీబీ డీజీ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో శంకబ్రత బాగ్చీని నియమించిన సంగతి తెలిసిందే. అలాగే తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి స్పష్టం చేసింది. `