అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించి మరో వారం రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్. 

ఇప్పటికే ఏపీలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం ఖాయమైంది. ఇకపోతే వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సైతం నిశ్చయమైపోయింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలిశారు. 

వైయస్ జగన్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. అయితే వైయస్ జగన్ సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లపై చర్చించినట్లు తెలుస్తోంది.