Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్ పాసైతే రూ.3వేలు నిరుద్యోగభృతి, కనీస ఆదాయం రూ.20వేలు : టీడీపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు ఇవే..

మీ భవిష్యత్తు.. నా బాధ్యత అని మేనిఫెస్టోకు నామకరణం చేశారు. ప్రధానంగా రైతులు, సామాన్యులు, యువత, మహిళలకు పెద్దపీట వేస్తూ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు పోటీగా టీడీపీ మేనిఫెస్టో ఉంది. 

ap cm chandrababu naidu releases tdp manifesto
Author
Amaravathi, First Published Apr 6, 2019, 4:01 PM IST

అమరావతి: ఉగాది పర్వదినాన తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. శనివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 

అంతకుముందు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీ భవిష్యత్తు.. నా బాధ్యత అని మేనిఫెస్టోకు నామకరణం చేశారు. ప్రధానంగా రైతులు, సామాన్యులు, యువత, మహిళలకు పెద్దపీట వేస్తూ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు పోటీగా టీడీపీ మేనిఫెస్టో ఉంది. 

మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు.  
1. రైతులు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ వర్తింపు
2. వృద్ధాప్య పింఛన్‌దారుల అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
3. డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కొనసాగింపు
4. ఉచితంగా ఉన్నత విద్య
5. ప్రభుత్వ పరిధిలో ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పన
6. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5లక్షలకు పెంపు
7. చంద్రన్నబీమా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
8. పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు
9. అందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వడం
10.  ప్రతి ఎకరాకు నీరు  
11. రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకం
12. రైతులకు పగటిపూట 12 గంటల పాటు ఉచిత విద్యుత్‌  
13.  రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, ధరల స్థిరీకరణ నిధి 
14. వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థల బలోపేతం
15. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు  
16. రైతు ఉత్పత్తులకు నాణ్యమైన ధరలు  
17. గిరిజన రైతులకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా విత్తనాలు, పెట్టుబడి  రాయితీలు
18. ఉద్యాన పంటలను కోటి ఎకరాలకు విస్తరింపు
19. 50 లక్షల ఎకరాల్లో డ్రిప్‌, స్పింక్లర్‌  వ్యవస్థల ఏర్పాటు
20. కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు
21. యువతకు ఏటా ఉద్యోగాల భర్తీ  
22. ఇంటర్ పాసైతే రూ.3వేలు నిరుద్యోగభృతి 
23. ఇంటర్‌ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ
24. కేంద్రంతో పోరాడి వ్యవసాయంతో నరేగా అనుసంధానం
25. ఆదివాసుల కోసం ప్రత్యేక బ్యాంక్‌  
26. మత్స్యకారుల పంట విరామం రూ.10 వేలకు పెంపు. డీజిల్‌ ప్రోత్సాహకం రూ.10కి పెంపు. 
27. మేజర్‌ పంచాయతీలన్నింటిలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు
28. పేదలకు పండుగనాడు ఉచితంగా రెండు గ్యాస్‌ సిలిండర్లు
29. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పదేళ్లు కొనసాగింపు. 
30.  రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు
31. కాపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ విదేశీ విద్య కోసం రూ.25 లక్షల ఆర్థిక సాయం 
32. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ 
33. మాదిగ, రెల్లిలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు
34.  రూ.10 వేల కోట్లతో బీసీలకు బ్యాంక్, బీసీ సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత
35. ఏపీఐఐసీ ప్లాట్లలో 25 శాతం బీసీలకు రిజర్వేషన్‌
36. ఇన్నోవా వంటి కార్ల కొనుగోలుకు 25 శాతం రాయితీ  
37. ప్రతి కుటుంబానికి రూ.20వేలు ఆదాయం కల్పించేలా చర్యలు
38. డ్వాక్రా మహిళలకు పసుపు - కుంకుమ పథకం కొనసాగింపు, ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు
39. మహిళా ఉద్యోగినులకు ద్విచక్రవాహనాల కొనుగోలుకు రాయితీలు
40 చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు 
41.  అంగన్ వాడీ కేంద్రాలకు సొంతభవనాల ఏర్పాటు
42.  ప్రీ స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభం
43. గిరిజన ప్రాంతాల్లో గర్భిణులకు హోమ్‌ ఫర్‌ ప్రేగ్నస్ట్‌ ఉమెన్‌ ఏర్పాటు
44. వర్గీకరణలో పెండింగ్‌లో ఉన్న కులాలకు న్యాయం 
45. వడ్డెర, బ్రాహ్మణ కులాలకు ఎమ్మెల్సీ  
46. చేనేత కార్మికులకు ఉచిత ఆరోగ్య బీమా, మార్కెటింగ్‌ నిధి రూ.250 కోట్లు ఏర్పాటు 
47. మంగళగిరిలో సెంటర్‌ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు   
48. కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ 
49. అన్ని అగ్ర కులాల్లోని పేదలకు న్యాయం చేస్తాం  
50. ఇస్లామిక్ బ్యాంకుకు ఏర్పాటు, వడ్డీలేని రుణాలు 
51. ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనం. శ్మశానాలకు స్థలాలు కేటాయింపు, పాస్టర్లకు, ఇమామ్‌, పూజారులకు ఉచితంగా ఇళ్లు 
52. దివ్యాంగులకు మూడు చక్రాల మోటారు వాహనం, స్వయం ఉపాధి కోసం రూ.50 వేల కోట్ల మూల ధనం. 
53. మానసిక వికలాంగులకు రూ.3 వేల పింఛను
54. రూ.10 లక్షలలోపు పెట్టుబడి ఉంటే వడ్డీ లేని రుణాలు 
55. రాజమహేంద్రవరం, ఏలూరు, తిరుపతిని ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దడం 
56. గ్రామాల్లో 2 వేల జనాభా ఉంటే భూగర్భ డ్రైనేజీ, సిమెంటు రోడ్లు, ప్రతి ఇంటికీ 70 లీటర్ల తాగునీరు 
57. మెగా టెక్స్‌టైల్‌ ప్లాంట్లలో 3 లక్షల ఉద్యోగాలు.
58. తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌   
59. విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్‌  
60. 100 శాతం అక్షరాస్యత సాధన దిశగా కృషి
61. ఆరోగ్య పర్యాటకం అభివృద్ధి   

టీడీపీ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. తమ మేనిఫెస్టో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని ప్రకటించారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేసేలా మేనిఫెస్టో రూపకల్పన  జరిగిందన్నారు. అలాగే తమ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. నాలుగో తరగతి ఉద్యోగులు, ఇతరుల పదవీ విరమణ వయసు పెంచినట్లు ప్రకటించారు చంద్రబాబు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios