ప్రత్యేక హోదాపై అవిశ్వాసం తీర్మానం పెడితే కేసీఆర్ ఎందుకు సపోర్ట్ చెయ్యలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హోదాపై తొలి సంతకం పెడతామని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రకటిస్తే వ్యతిరేకించింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చెయ్యలేదా అని మండిపడ్డారు.
అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం సంతోషమన్నారు చంద్రబాబు.
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. వారం రోజుల నుంచి కేసీఆర్‌ను బట్టలు ఉతికినట్లు ఉతికి ఆరేస్తున్నాని చెప్పుకొచ్చారు.
జగన్, కేసీఆర్‌తో కలిసి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తనపై పెత్తనం చేయించాలని చూస్తే సహించేది లేదన్నారు. ఆంధ్రావాళ్లు ద్రోహులని కేసీఆర్ తిట్టలేదా?. తెలుగుతల్లిని కించపరిచేలా మట్లాడలేదా అని ప్రశ్నించారు.
ఆంధ్రావాళ్లు పనికిరాని దద్దమ్మలని తనకు కూడా తెలివి లేదని కేసీఆర్ అన్న విషయాలను గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై అవిశ్వాసం తీర్మానం పెడితే కేసీఆర్ ఎందుకు సపోర్ట్ చెయ్యలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
హోదాపై తొలి సంతకం పెడతామని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రకటిస్తే వ్యతిరేకించింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చెయ్యలేదా అని మండిపడ్డారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఆంధ్రావాళ్లకు పెత్తనం ఏంటి అంటావా?. నీ బోడి పెత్తనం మాకు కావాలా..? అంటూ ధ్వజమెత్తారు. కోడికత్తి పార్టీకి వెయ్యి కోట్లు పంపించి లక్ష కోట్లు ఎగ్గొట్టాలని చూస్తావా? అంటూ కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ ఆస్తుల్లో 58 శాతం వాటా ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబితే కేంద్రం సహకారంతో కేసీఆర్ అడ్డుపడ్డారని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై రిట్ వేస్తారా అని నిలదీశారు. భద్రాచలం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేనని భద్రాచలాన్ని ఇచ్చేయండంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు చంద్రబాబు.
ఈ వార్తలు కూడా చదవండి
