తెలుగుదేశం పార్టీ గెలుపును అడ్డుకోవడానికి జరిగిన కుట్రలను ప్రజలే అడ్డుకున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. అమరావతిలో ఆయన సోమవారం ఉదయం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వైసీపీ అరాచకాలను, బీజేపీ తప్పుడు పనులను ఎండగట్టామని.. సకాలంలో స్పందించి ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేశామన్నారు. పోలింగ్ రోజు ఉదయాన్నే ఈవీఎంలు మొరాయించేలా చేశారని చంద్రబాబు ఆరోపించారు.

తాడిపత్రిలో టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి హత్య, స్పీకర్‌పై దాడి, మహిళా అభ్యర్థులపై దౌర్జన్యాలు చేశారని మండిపడ్డారు. తప్పులు చేసి ప్రజా తీర్పును కాలరాయాలని చూశారని ఓటింగ్ శాతాన్ని దెబ్బ తీయాలని వైసీపీ వాళ్లు అనేక కుట్రలు చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.