ఆమెకు హైదరాబాద్ లో టీవీ షోలు తప్ప ప్రజలను పట్టించుకోరని విమర్శించారు. రోజా వల్ల ప్రజలకు ఏ ఉపయోగం లేదన్నారు. నోటి దురుసుతో మాట్లాడటం, పద్దతి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం తప్ప ఇంకేమీ తెలియదన్నారు. 

చిత్తూరు: నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోజాపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరి నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు రోజా ప్రజలకు అందుబాటులో ఉండరని విమర్శించారు. 

నియోజకవర్గానికి ఆమె చేసిందేమీ లేదని ఆరోపించారు. కనీసం నియోజకవర్గ అభివృద్ధికి కూడా కృషి చెయ్యలేదన్నారు. ఆమెకు హైదరాబాద్ లో టీవీ షోలు తప్ప ప్రజలను పట్టించుకోరని విమర్శించారు. 

రోజా వల్ల ప్రజలకు ఏ ఉపయోగం లేదన్నారు. నోటి దురుసుతో మాట్లాడటం, పద్దతి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం తప్ప ఇంకేమీ తెలియదన్నారు. మరోవైపు వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు. 

తనను 420 అంటున్నాడని చెప్పుతో కొడతా అంటూ జగన్ వ్యాఖ్యానిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యక్తులను ఇంటికి పంపిచాలని పిలుపునిచ్చారు. మళ్లీ పోటీ చెయ్యకుండా గుణపాఠం చెప్పాలని చంద్రబాబు సూచించారు.