శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైకిల్ చైన్ పీకేశారంటూ చేసిన పవన్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. 

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న చంద్రబాబు నా సత్తా నీకు తెలియకపోవచ్చేమోకానీ కేసీఆర్ కు తెలుసునని చెప్పుకొచ్చారు. సైకిల్ చైన్ తెంచే దమ్ము ధైర్యం కేసీఆర్ కు ఉందా అంటూ నిలదీశారు. 

ఒకప్పుడు ఈ సైకిల్ ఎక్కినోడేనని చెప్పుకొచ్చారు. సైకిల్ జోరు పెంచితే బుల్లెట్ లా మారి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోందన్నారు. సైకిల్ చైన్ పీకడం ఎవరి వల్ల కాదన్నారు. అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని పునరుద్ఘాటించారు. 

అభివృద్ధి తాను చేయలేకపోతే సినిమా యాక్టర్‌ చేస్తాడా అంటూ పవన్ కళ్యాణ్ పై చురకలు వేశారు. కోడికత్తి పార్టీ, జనసేన పార్టీకి రాజకీయాలపై కానీ సమస్యలపై కానీ అవగాహన లేదన్నారు సీఎం చంద్రబాబు.