Asianet News TeluguAsianet News Telugu

కనీస అవగాహనలేదు, ఎవరో చెప్పింది ప్రకటించారు: వైసీపీ మేనిఫెస్టోపై చంద్రబాబు

ఎంతమేరకు చేయగలమోనన్న కనీస అవగాహన లేకుండా ఎవరో చెప్పింది మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నారని ఆరోపించారు. అనుభవం లేనివాళ్ల మాటలకు విలువలేదని తెలిపారు.  అమరావతి గ్రాఫిక్స్ అని విమర్శిస్తున్నారు. అది పూర్తైతే వైసీపీ కడుపు మండుతుందన్నారు. అందుకే మేనిఫెస్టోలో అమరావతిని పెట్టలేకపోయారని విమర్శించారు. 

ap cm chandrababu naidu comments on ysrcp manifesto
Author
Amaravathi, First Published Apr 6, 2019, 2:47 PM IST

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. వైసీపీ మేనిఫఎస్టో అవగాహన లేని ప్రాజెక్టు అంటూ విమర్శించారు. 

ఎంతమేరకు చేయగలమోనన్న కనీస అవగాహన లేకుండా ఎవరో చెప్పింది మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నారని ఆరోపించారు. అనుభవం లేనివాళ్ల మాటలకు విలువలేదని తెలిపారు.  అమరావతి గ్రాఫిక్స్ అని విమర్శిస్తున్నారు. 

అది పూర్తైతే వైసీపీ కడుపు మండుతుందన్నారు. అందుకే మేనిఫెస్టోలో అమరావతిని పెట్టలేకపోయారని విమర్శించారు. గతంలో తాము చెప్పిన దానికంటే అధికారంలోకి వచ్చాక ఎక్కువే చేశామని చంద్రబాబు తెలిపారు. కొందరు ఇవి చేస్తాం, అవి చేస్తామని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.  

పేదరికం లేని ఆరోగ్యకర, ఆనందదాయక సమాజం ఏర్పాటే తమ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్‌ సంక్షేమ పథకాలను దేశం అనుసరిస్తోందని చెప్పుకొచ్చారు. గర్భం దాల్చినప్పటి నుంచి చివరి దశ వరకు చేయూత ఇస్తున్నామని ప్రకటించారు.

 2004-2014 మధ్య కాలంలో రైతులు, మహిళలు, యువత అందరూ ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. అనుభవం లేనివాళ్ల మాటలకు విలువలేదన్న చంద్రబాబు నదులు అనుసంధానం చేయడం వల్లే పులివెందులకు నీళ్లు ఇవ్వగలిగామని చెప్పుకొచ్చారు.  

Follow Us:
Download App:
  • android
  • ios