అమరావతి: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. కడప జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై సిఈవో గోపాలకృష్ణ ద్వివేది ఆరా తీశారు. నేరుగా కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మతో సీఈవో గోపాలకృష్ణ ద్వివేది ఫోన్‌లో మాట్లాడారు. 

హత్యకు గల కారణాలేంటో తెలుసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దని ఎస్పీకి ఆదేశించారు. హత్యకు సంబంధించి నివేదిక అందించాలని ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలపై రాయలసీమలోని అన్ని జిల్లాల ఎస్పీలతో ఆయన సమీక్షించారు. 

కర్నూలు జిల్లా మంత్రాలయం ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. ఇకపోతే రాయలసీమ జిల్లాలో అధికారులంతా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు.