ఆంధ్ర ప్రదేశ్ లో మరో నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. సమయం తగ్గుతున్న నాయకుల మధ్య మాటల యుద్దం పెరుగుతోంది. గత ఎన్నికల్లో మిత్రపక్షంగా పోటీచేసిన టిడిపి, బిజెపిలు ఈ ఎన్నికల్లో ఉప్పు,నిప్పులా మారాయి. ఈ క్రమంలో ఇరుపార్టీల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. 

ఈ మాటల యుద్దం మరింద ముదిరి పరుష దూషణలకు దారిస్తోంది. ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అయితే చంద్రబాబుపై ట్విట్టర్ వేదికన ఘాటు విమర్శలు చేశారు.  ఊసరవెల్లి ఫోటోకు ఈ కింది కామెంట్ జతచేసి తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 

" ప్రజలకి సమాధానం చెప్పం..
కేంద్రానికి లెక్కలు చెప్పం..
మీడియాకి నిజాలు చెప్పం..
ఐనా నన్ను నమ్మండి ఎందుకంటే 
నాది కుప్పం..! "

ఇలా  మాట్లాడే ఆయన ఎవరో తెలుసా!?!?!?

Hint :-వెన్నుపోటుకి వారసుడు..
U టర్న్ కి దగ్గరి చుట్టం..'' అంటూ కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.