గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఘోరంగా ఓటమి పాలయ్యారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో పరాజయం పాలయ్యారు. 

అంబటి రాంబాబు 22 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇకపోతే సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తాను గెలుస్తానని కోడెల శివప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. తాను 30వేల మెజారిటీతో గెలుస్తానని ప్రెస్మీట్లు పెట్టి మరీ చెప్పుకొచ్చారు. 

అయితే అంబటి రాంబాబు చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. కోడెల శివప్రసాదరావుపై ఉన్న వ్యతిరేకతే ఆయన ఓటమికి కారణమని తెలుస్తోంది. ఇకపోతే ఎన్నికల సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై జరిగిన దాడి నేపథ్యంలో ఒక్కసారిగా సత్తెనపల్లి నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కోడెల, అంబటి రాంబాబు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజలు మాత్రం వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకే పట్టం కట్టారు.