ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించాల్సిన తొలి జాబితా వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని మార్చి 16కి వాయిదా వేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది.

16 ఉదయం 10.26 గంటలకు జాబితాను విడుదల చేయనుంది. ఇవాళ ఉదయం పీవీపీతో పాటు తోట నర్సింహం కుటుంబం వైసీపీలో చేరింది. దీనితో పాటు వచ్చే రెండు రోజుల్లో భారీ చేరికలు ఉండే అవకాశం ఉండటంతో అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

దానికి తోడు కొత్తగా చేరే వారితో ఇవాళ చర్చలు, పార్టీలోకి ఆహ్వానించే లోగా ముందుగా అనుకున్న ముహూర్తం దాటిపోవడం కూడా అభ్యర్థుల జాబితా విడుదల వాయిదా పడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 16వ తేదీ ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం మొత్తం 175 మందితో మొత్తం జాబితా ప్రకటించాలని జగన్ భావిస్తున్నారు.