Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం: కానిస్టేబుల్ పై వేటు

విధులకు డుమ్మా కొట్టి టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ కానిస్టేబుల్ ను పారిపోయిన ఉద్యోగిగా పరిగణిస్తూ పోలీస్ శాఖ ప్రకటించింది. అతని 3నెలల వేతనాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అనంతపురం రూరల్‌ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసే నరసింహమూర్తి గత 21 రోజులుగా విధులకు డుమ్మా కొట్టి టీడీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 

ananthapuram sp ashok kumar action against constable
Author
Ananthapuram, First Published Apr 6, 2019, 3:02 PM IST

అనంతపురం : తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కానిస్టేబుల్ పై ఎన్నికల కమిషన్, పోలీస్ శాఖ వేటు వేసింది. విధులకు డుమ్మా కొట్టి టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ కానిస్టేబుల్ ను పారిపోయిన ఉద్యోగిగా పరిగణిస్తూ పోలీస్ శాఖ ప్రకటించింది. 

అతని 3నెలల వేతనాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అనంతపురం రూరల్‌ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసే నరసింహమూర్తి గత 21 రోజులుగా విధులకు డుమ్మా కొట్టి టీడీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 

ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారులతోపాటు ఈసీ దృష్టికి వెళ్లింది. కానిస్టేబుల్ నరసింహమూర్తి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు విచారణలో తేలిందని అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అతని మూడు నెలల జీతాన్ని నిలిపివేసినట్లు ప్రకటించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios