ఏలూరు: సినీ ఇండస్ట్రీ అంతా తెలంగాణ రాష్ట్రంలోనే ఉండిపోవడం వల్ల నటులంతా ఒత్తిడితో ఉన్నారని ఏపీ ఫిల్మ్ డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్  అంబికా కృష్ణ వ్యాఖ్యానించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ ఉండటం వల్ల వాళ్లంతా ఒత్తిడిలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. 

సినీ గ్లామర్ జనాలు పోగవడానికి ఉపయోగపడతారు అంటూ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సినీ ఆర్టిస్టులు సిద్ధంగా ఉన్నారంటూ తెలిపారు. ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో అన్నది అంచనా వెయ్యడం కష్టంగా ఉందన్నారు. 

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటం వల్ల గెలుపోటములను అంచనా వెయ్యలేకపోతున్నామన్నారు. ఏపీ ఓటర్లు చాలా తెలివైన వారని స్పష్టం చేశారు. ఎవరికి వెయ్యాలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అంబికా కృష్ణ స్పష్టం చేశారు. 

ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సినీ ఆర్టిస్టులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వీరాజ్ నేతృత్వంలో కొందరు నటుల బృందం ఉత్తరాంధ్రను చుట్టేస్తోంది. మరోవైపు సినీనటి రమ్య శ్రీ విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వీరితోపాటు అలీ, తనీష్ లు కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.