ప్రకాశం: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఓటమి పాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. 

ఆమంచి కృష్ణమోహన్ పై టీడీపీ అభ్యర్థి కరణం బలరాం 17,801 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన ఆమంచి కృష్ణమోహన్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్  కొడదామని భావించారు. 

అంతేకాదు వైయస్ జగన్ కేబినేట్ లో మంత్రి పదవి కూడా ఖాయమంటూ ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి తరుణంలో ఆయన ఆశలను ఆవిరి చేస్తూ ఓటర్లు తీర్పునిచ్చారు. టీడీపీ అభ్యర్థి కరణం బలరాంకు పట్టం కట్టారు.