అమరావతి: ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఏపీలో రాజకీయాలు షురూ అయ్యాయి. ఇప్పటికే డేటా చోరీ కేసులో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకుంటున్నారు. 

ఈ కేసుల వివాదం మరువకముందే వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పైనా మరియు సాక్షి దినపత్రికపైనా టీడీపీ అధికార ప్రతినిధి ఏపీ సిఈవో గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. 

సాక్షి పత్రికలో రిటైర్డ్‌ సీఎస్‌ అజయ్‌కల్లాంతో ఆర్టికల్‌ రాయించుకుని టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని దివ్యవాణి ఫిర్యాదులో ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.60 లక్షల టారిఫ్ అయ్యే ఇంటర్వ్యూ రాయించుకుని ప్రచారం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. 

సాక్షి పత్రికను పార్కులు, వీధుల్లో ఉచితంగా ఇస్తున్నారని దివ్యవాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ. 60 లక్షలను ఎన్నికల ఖర్చు కింద జగన్‌ అకౌంట్‌లో రాయాలంటూ సిఈవో గోపాలకృష్ణ ద్వివేదీని కోరారు. దివ్యవాణితోపాటు బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనందసూర్య కూడా సిఈవోను కలిశారు.