Asianet News TeluguAsianet News Telugu

గంటాకు నీతి, నిజాయితీ అనేవి తెలీదు: సినీనటి రమ్యశ్రీ

రాబోయే ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలను, 23 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రమ్యశ్రీ వైఎస్ జగన్‌ తోనే రాజన్న రాజ్యం వస్తుందని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు 3,600కిలోమీటర్ల పాదయా త్ర చేసిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. 

actor ramyasri fires on minister ganta srinivasarao
Author
Visakhapatnam, First Published Apr 9, 2019, 3:42 PM IST

విశాఖపట్నం: రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సినీనటి, వైసీపీ నేత రమ్యశ్రీ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలను, 23 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రమ్యశ్రీ వైఎస్ జగన్‌ తోనే రాజన్న రాజ్యం వస్తుందని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు 3,600కిలోమీటర్ల పాదయా త్ర చేసిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. 

రాజన్న రాజ్యంకోసం ప్రతి ఒక్కరూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ నాయకులు డబ్బులు ఇచ్చి  ఓటు వేయాలని ప్రమాణాలు చేయించుకోవడం దురదృష్టకరమన్నారు. 

దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చూస్తున్నారని రాబోయే ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పాలని సూచించారు. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాస్ పైనా ఆమె విరుచుకుపడ్డారు. 

గంటాకు నీతి, నిజాయితీ లేవన్నారు. ఐదేళ్లకు ఒకసారి నియోజవర్గాలు మార్చిన వ్యక్తి మనకు అవసరమా అంటూ చెప్పుకొచ్చారు. బీసీలకు అండగా ఉన్న ఏకైక నాయకుడు వై.ఎస్‌.జగన్‌ అంటూ చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో బీసీలకు పెద్దపీట వేశారని ఆమె స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని సినీనటి రమ్యశ్రీ విజ్ఞప్తి చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios