Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ టీడీపీదే అధికారం, నో డౌబ్ట్ : హీరో నారా రోహిత్

చంద్రబాబునాయుడు ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఎన్నో అభి వృద్ధి కార్యక్రమాలు చేసిందని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల వారికీ సంక్షేమ ఫలాలు అందించారని వారంతా మళ్లీ టీడీపీకి ఓటెయ్యడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 

actor nara rohith election campaign
Author
Rajamahendravaram, First Published Apr 4, 2019, 8:18 AM IST

సీతానగరం : రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు నారావారి హీరో నారా రోహిత్. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 

రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవకర్గ పరిధిలోని సీతానగరంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ లకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

మంచి చేసే నాయకుడిని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎన్నడూ మరచిపోరన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఎన్నో అభి వృద్ధి కార్యక్రమాలు చేసిందని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల వారికీ సంక్షేమ ఫలాలు అందించారని వారంతా మళ్లీ టీడీపీకి ఓటెయ్యడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నారా రోహిత్ ధీమా వ్యక్తం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios