అనంతపురం: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా సప్తగిరి సర్కిల్ సమీపంలోని మసీదు సమీపంలో నిల్చున్నారు. 

మసీదు పైకి ఎక్కువ మంది యువకులు ఎక్కారు. పురాతన మేడ కావడంతో గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో దాదాపు 24 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. గాయాలపాలైన క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఒక మహిళకు తీవ్ర గాయాలవ్వగా కొందరికి స్వల్పగాయాలయ్యాయి. స్థానిక టీడీపీ నేతలు ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలోనే బస చేశారు. గురువారం ఉదయం పుట్టపర్తిలో చంద్రబాబు పర్యటించనున్నారు. 

మరోవైపు మడకశిరలో చంద్రబాబు నాయుడు సభకు కార్యకర్తలతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ఘటనలో క్రిష్టప్ప అనే టీడీపీ కార్యకర్త మృత్యువాత పడగా మరో 9మంది తీవ్ర గాయాలపాలయ్యారు.