గురువారం విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన బహిరంగసభలో అపశృతి చోటు చేసుకుంది. నగరంలోని 80 ఫీట్ రోడ్డులో జరిగిన ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు. 

గురువారం విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన బహిరంగసభలో అపశృతి చోటు చేసుకుంది. నగరంలోని 80 ఫీట్ రోడ్డులో జరిగిన ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఉదయం 10 గంటలకు పవన్ ఇక్కడికి రావాల్సి ఉండగా.. గాజువాకలో మీటింగ్ అనంతరం 1.30కి బహిరంగసభ వద్దకు చేరుకున్నారు. జనసేనాని రాకతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా గోలలు, కేకలతో మారుమోగింది.

ఆయనను చూసేందుకు యువత, మహిళలు ఎగబడటంతో తోపులాట జరిగింది. మైకులు పెట్టే బాక్స్‌పైకి ఎక్కి మరి పవన్‌ను చూసేందుకు చాలా మంది నిలబడ్డారు. అయితే బరువును ఆపుకోలేక ఆ స్టాండ్ కూలిపోయింది.

దీంతో దానిపై ఎక్కిన వారు కింద వున్న వారిపై పడ్డారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా, ఓ మీడియాకు సంస్థకు చెందిన ఫోటోగ్రాఫర్‌కు కాలు విరిగిపోయింది. దగ్గర్లో ఎక్కువ మంది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.