అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు శుక్రవారం భేటీ అయ్యారు.రాష్ట్రంలో ముగ్గురు ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.

చంద్రబాబుతో ఏబీ వెంకటేశ్వర రావు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో ఏం చేయాలనే విషయంపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.

తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావును బదిలీ చేయకుండా ఉండేందుకు చంద్రబాబు ప్రభుత్వం చివరి వవరకు ప్రయత్నాలు సాగించింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ కూడా రాశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.