నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో సుమారు 200కు పైగా వీవీప్యాట్లు స్లిప్పులు సోమవారం నాడు వెలుగు చూశాయి. దీంతో ఈ విషయానికి ప్రాధాన్యత ఏర్పడింది.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సోమవారం నాడు 200కు పైగా  వీవీప్యాట్లు స్లిప్పులు వెలుగు చూశాయి.  ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది.

అయితే పోలింగ్‌కు ముందు నిర్వహించిన మాక్ పోలింగ్‌కు సంబంధించిన ర్యాండమైజేషన్‌కు  వీవీప్యాట్లు స్లిప్పులుగా అధికారులు చెబుతున్నారు.  పాఠశాల ఆవరణను ఆర్డీఓ చిన్న రాముడు తనిఖీ చేశారు.

 వీవీప్యాట్లు స్లిప్పులు మాక్ పోలింగ్‌ నిర్వహించిన సందర్భంగా వెలువడినట్టుగా ఆయన చెప్పారు. మాక్ పోలింగ్ తర్వాత వెంటనే ఈ  వీవీప్యాట్లు స్లిప్పులు దగ్దం చేయాల్సి ఉంది. కానీ ఆ రోజు వాటిని దగ్దం చేయలేదు. ఆ తర్వాత పాఠశాల ఆవరణలోనే  వేశారు.   ఈ విషయం తెలిసిన  ఆర్డీఓ ఆ ప్రాంతంలో తనిఖీ చేసి  వీవీప్యాట్లు స్లిప్పులు దగ్ధం చేశారు.