నాలుగేళ్ళు గట్టి పోటీ ఇచ్చి పోరాడిన వైసిపి పార్టీ కార్యకర్తలు ఎన్నికలు దగ్గరకి వస్తున్న తరుణంలో ఢీలా పడ్డారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో పార్టీ కార్యకర్తలు స్తబ్దుగా ఉంటున్నారు. అటు సోషల్ మీడియాలో ఇటు క్షేత్ర స్థాయిలో సైలెంట్ అయ్యారు. గత నాలుగేళ్లుగా వైఎస్సార్సిపి కార్యకర్తల దూకుడుతనం చూసి ఆశ్చర్యపోయి, వైయస్ఆర్సీపీ సోషల్ మీడియాను ఎదుర్కోవడం కష్టం అని భావించిన టిడిపి వైఎస్సార్సిపి ఇప్పుడు అంతగా చురుకుగా లేకపోవటం చూసి అంతర్గతంగా సంతోషపడుతోందని విశ్వసనీయ వర్గాల భోగట్టా....!!

ఇంకో 20 రోజులు వైయస్ఆర్సీపీ ఇలానే స్తబ్దుగా ఉంటే టిడిపి పార్టీ గెలవటం ఖాయమని తనదైన శైలిలో టిడిపి సోషల్ మీడియాలో దూసుకుపోతోంది, కానీ వైఎస్సార్సీపీ మాత్రం దాన్ని గమనించలేకపోతుంది. ఖచ్చితంగా ఈ సారి ఎలాగైనా గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్సో ఇంకేదో తెలియదు కానీ వైసిపి కార్యకర్తలు మాత్రం ట్విట్టర్ లో నాలుగు ట్రెండ్ లు చేస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో నిజమైన ఓట్లర్లను ఏ మాత్రం ప్రభావితం చేయట్లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రోజుకో ట్రెండ్ టీడీపీకి వ్యతిరేకంగానో తమ పార్టీకి పాజిటివ్ గానో ట్విట్టర్లో విచ్చలవిడిగా ట్రెండ్ చేస్తున్న పార్టీ కార్యకర్తలు ఆ ట్రెండ్ లు మాములు ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయోనని మాత్రం ఆలోచించలేకపోతున్నారు. అసలు ఆ ట్రెండ్ ల వల్ల ప్రజలకు కానీ పార్టీ కి కానీ ఏమైనా ఉపయోగం అవుతుందా అన్నది కూడా తెలుసుకోలేకపోతున్నారు. ట్విట్టర్ లో ట్రెండ్ అయితే చాలు పార్టీ గెలిచేసినట్టు ఫీల్ అవుతూ వైసిపి కార్యకర్తలు కేవలం నాలుగు ట్వీట్స్ వేసి తమ చేతులు దులిపేసుకుంటున్నారు. 

2014 ఎన్నికలలో ఇలాంటి తప్పిదాలతోనే తృటిలో అధికారం కోల్పోయిన వైసిపి ఇప్పుడు కూడా అదే తప్పిదాలతో ఆ పార్టీ కార్యకర్తలు పార్టీకి అధికారం దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని పార్టీలోని కొందరు యువ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ రానున్న ఎన్నికలు వైసిపికి టీడీపీ ఇరు పార్టీలకు అత్యంత పోటాపోటీగా జరగనున్నాయి.