హైదరాబాద్: వైసీపీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ,  జగన్  సోదరి షర్మిల విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు.

ఈ ఎన్నికల్లో షర్మిల, విజయమ్మలు పోటీకి దూరంగా ఉన్నారు.  2014 ఎన్నికల సమయంలో వైఎస్ విజయమ్మ  విశాఖ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నెల 27వ తేదీ నుండి  వీరిద్దరూ కూడ ప్రచారం చేయనున్నారు.

ఈ దఫా విజయమ్మ పోటీ చేయడం లేదు.రాష్ట్రంలోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో షర్మిల ప్రచారాన్ని నిర్వహించేలా ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. బహిరంగ సభలు, రోడ్‌షోలను నిర్వహించనుంది.

40 నియోజకవర్గాల్లో వైఎస్ విజయమ్మ ప్రచారాన్ని నిర్వహించనున్నారు.  షర్మిల, విజయమ్మ వేర్వేరు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తారు. వీరిద్దరి ప్రచారం కోసం వైసీపీ రెండు ప్రత్యేకమైన బస్సులను సిద్దం చేసింది. ఉత్తరాంధ్రలోని పది జిల్లాల్లో షర్మిల ప్రత్యేకంగా కేంద్రీకరించి ప్రచారాన్ని నిర్వహించనుంది. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండే షర్మిల ప్రచారాన్ని ప్రారంభంచనున్నారు.