గట్టిగా అరచినంత మాత్రన పిల్లి.. పులి అయిపోతుందా అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
గట్టిగా అరచినంత మాత్రన పిల్లి.. పులి అయిపోతుందా అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ పార్టీ తరపున మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారు. మంగళగిరి నుంచి లోకేష్ ప్రచారం చేస్తుండటంతో.. ఆమె ఆ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకున్నారు. కాగా.. సోమవారం ఆమె పొన్నూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
ఈ సందరర్భంగా షర్మిల మాట్లాడుతూ...రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. అన్ని సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేశారని చెప్పారు. కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు వైఎస్‌ఆర్ మేలు చేశారని తెలిపారు.
అమరావతిని అమెరికా, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తానని చంద్రబాబు మాయ మాటలు చెప్పారు. పిల్లి గట్టిగా అరిస్తే పులి అవుతుందా.. పిల్లిపిల్లే.. పులిపులేనన్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందని చెప్పారు... జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండంటూ వేడుకున్నారు. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న రావాలని చెప్పారు. వైఎస్‌ఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని షర్మిల పేర్కొన్నారు.
